Dhanussu—Sagittarius
ధనస్సు – 2017 – 18
మూల. ,2,3,4 పాదములు.
పూర్వాషాడ.1,2,3,4.పాదములు.
ఉత్తరాషాడ 1. పాదము.
ఆదాయము – 8, వ్యయం.11. రాజపూజ్యము – 6, అవమానం – 3.
ఈ సంవత్సరం వీరికి గురుడు 10వ ఇంట సెప్టెంబర్ 12 వరకు లోహమూర్తిగాను, తదుపరి 11వ ఇంట సువర్ణమూర్తిగాను ఉండును. శని ఒకటవ ఇంట సంవత్సరమంతాను సువర్ణమూర్తి. రాహువు 9వ ఇంట, కేతువు 3వ ఇంట ఆగస్టు 17 వరకు తామ్రమూర్తి. తదుపరి 8వ ఇంటికి రాహువు, 2వ ఇంట కేతువు తామ్రమూర్తులు. ఈ సంవత్సరంలో వీరికి కార్యసిద్ధి లాభము, ఆరోగ్య భంగములు, ధనవ్యయము కూడా సూచిస్తున్నది. రాహువు వలన పుత్రసంబంధిత సుఖము, కేతువు వల్ల సహోదర కలహము సూచిస్తున్నది.
ఉద్యోగస్తులకు కొద్దిపాటి శుభఫలితములు గోచరిస్తున్నాయి. పై అధికారులచే మెప్పుపొందే అవకాశం ఉంది.
వ్యాపారులకు ప్రథమార్థం బాగుండి, చివరికి కొంత నష్టాలు చవిచూసే అవకాశాలు రావచ్చు. పాడిపరిశ్రమలు, పౌల్డ్రీ, వైద్య వృత్తుల వారు కొద్ది పాటు లాభములే సరిపెట్టుకోవాల్సి రావచ్చు.
వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా, రెండవ పంట అనుకూలం.
ఇక విద్యార్థుల విషయం చూడగా, వారికి మంచి ఫలితములే సూచిస్తున్నాయి. కొంత మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి సంవత్సరం మధ్య నుంచి బాగుండును.
రాజకీయ నాయకులకు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్ననూ కొంత అనుకూలంగానే ఉండును.
ఈ రాశి వారికి శని శాంతి చేయించుకున్నా శుభఫలితాలు పొందగలరు.
వీరు ఈ సంవత్సరము శని, యంత్రములు ధరించుట వల్ల మంచి ఫలములు పొందు అవకాశమున్నది.
యంత్రములకై సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***
Leave a Reply
You must be logged in to post a comment.