మాస ఫలములు

ఆషాడ మాస ఫలములు-2014

 ఆషాడ మాస ఫలితములు

 28-06-2014 నుండి 26-07-2014

మాస ఫలములు[ జూలై 2014]

మేషం  
ఆర్ధిక లావాదేవీలు అనుకూలము గానే ఉండగలవు, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెకూర గలదు, రాజకీయముగా కూడా లాభించగలదు పదవులు పొందే అవకాశమున్నది, కొన్ని సమస్యలు విరోధములు ఉన్నప్పటికీ అనుకొన్నవి పూర్తి చేస్తారు, ఆరోగ్యవిషయములో జాగ్రత్త వహించండి.
వృషభం 
ఆరోగ్యము కుదుట పడగలదు, ఇంట శుభ కార్యక్రమముల ప్రస్తావన, ఆర్ధికముగా అభివృద్ధి ఉండగలదు, ఇంటిలో సంతోష వాతావరణము నెలకోనగలదు, బయట పరిచయాలు పెరుగుట రాజకీయముగా అభివృద్ధి, శుభ వార్తా శ్రవణము ఇత్యాది శుభ ఫలములుతో ఈ నెల వుండ గలదు.
మిధునం 
ఈ నెల కొన్ని లోట్లు భర్తీ కాగలవు, ముందుకంటే బాగుండగలదు, వ్యాపార వ్యవహారాలూ ముందుకు సాగుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, పూర్వము ఇబ్బంది పెట్టిన కొన్ని సమస్యలు తొలగుతాయి, ధన ఆదాయము కూడా బాగుండగలదు, ఖర్చులు కూడా అధికంగా వుంటాయి, కొత్త పనులను తలపెట్టుతారు.
కర్కాటకం
ఊహించని ఇబ్బందులు సమస్యలతో ఈ మాసము ఉండగలదు, అనవసరపు తగువులు మిత్రులే శత్రువులుగా ప్రవర్తించుదురు, పోలిస్టేషన్ కు వెళ్ళుట, రహస్యముగా జీవించుట కూడా ఉండవచ్చు, ధనము మంచినీరులా ఖర్చు కాగలదు, పై అధికారులతో ఇబ్బందులు, అనారోగ్యము, ఆడవారితో ఇబ్బందులు ఉండగలవు.
సింహం 
ఆరోగ్యం మందగించడముతో ఇబ్బందులు తలెత్తుతాయి, ధనాదాయము బాగా తగ్గుతుంది, ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటారు, దేనిమీదా ధ్యాస వుండదు, వ్యవహారాలలో వెతిరేకత మీకు కనిపించుతుంది, ఇంటిలో గొడవలు పెరుగుతాయి, అనవసరపు మాటలు పడవలసి రావచ్చును.
కన్య 
ఈమాసము మీకు బాగుండగలదు, ఆర్ధికముగా కూడా బాగుంటుంది, వ్యాపార వ్యవహారాలలో నిలదోక్కుకోంటారు, మధ్యవర్తి వ్యవహారాలలోను మీదే పై చెయ్యిగా ఉండగలదు, రాజకీయ నాయకుల పరిచయాలు అండదండలు కలుగుతాయి, నూతన గృహ వ్యవహారాలను చక్క బేడతారు.
తుల 
అనుకోని వాహన ప్రమాదములు, శారీరక గాయములు, రక్తము కళ్ళ చూచుట, కుజప్రభావము వల్ల అనుకోని గొడవలు కేసులలో చిక్కుకొనుట జరుగగలదు తగు జాగ్రత్త వహించండి, ఆదాయ సంబందిత వ్యవహారములు బాగానే ఉండగలవు, వ్యాపారము బాగుండును, సుందరకాండ పారాయణ మంచిది .
వృశ్చికం 
మీకు వృత్తి పర ఇబ్బందులు తప్పక పోవచ్చును, భయము ఆందోళన కలుగ గలదు, మీరు నమ్మిన వారే మిమ్మలిని మోస పుచ్చుడురు, ధైర్యము పోయి పిరికితనము ప్రవేశించును, మీ పరువుకు నష్టము కల్గు అవకాసము వున్నది జాగ్రత్త, బందు విరోధములు మాటలు పడుట వుండ గలదు.
ధనస్సు 
అనుకొన్న పనులను అర్ధాంతరంగా వాయిదా వేయవలసి వస్తుంది, గ్రహాలు అనుకూలత అంతగా లేకపొవడముతో కొన్ని ఇబ్బందులు తప్పవు, ప్రయాణాలలో కూడా ఇబ్బందిని చవి చూడ వలసి వస్తుంది, పెద్ద వారితో విరోధాలు, ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో కూడా సమస్యలు వుందా గలవు.
మకరం 
వ్యాపారము అభివృద్ధిగా ఉండగలదు, ధన ఆదాయము పెరుగుతుంది, భండుమిత్రుల రాకతో ఇంట సందడి నెలకోనగలదు, సమస్యలు తొలగి సంతోషము పెరుగాగలదు, నూతన గృహ సామగ్రిని సమకూర్చుట, శుభ పర ఖర్చులు ఉండగలవు, రాజకీయ నాయకులకు కూడా బాగుండ గలదు.
కుంభం 
వ్యాపార పోటిని తట్టుకొని మంచి లాభములను పోందుదురు, అన్ని రంగాల వారికి ఇది మంచి సమయము గా చెప్పా వచ్చను, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభములు పొందు సమయము, నూతన స్త్రీ పరిచయాలు కలుగును, భందు మిత్రుల రాకతో ఇంట హడావిడి నెలకొనును.
మీనం 
అనుకోని విధముగా సమస్యలు పెరుగును, అందరితోను తగవులు కలుగును, కోర్టుకు సంబందించిన వ్యవహారములలో ఇబ్బందులు, పొలిసు స్టేషనుకు వెళ్ళవలసి వచ్చుట, ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకొనుట అసాధ్యము అనట్లు ఉండును, మీ పేరుప్రతిష్టలు దెబ్బ తిను అవకాశమున్నది తగు జాగ్రత్త పాడుట మంచిది.