Menu

Kanya—Virgo

virgo

 

కన్య -2016-17

ఉత్తర.2,3,4. పాదములు.

హస్త.1,2,3,4.పాదములు.

చిత్త.1,2. పాదములు.

ఆదాయము – 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6.

ఆగస్టు 11, 2016 వరకు గురుడు పన్నెండవ ఇంట తామ్రమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా ఒకటవ ఇంట తామ్రమూర్తిగాను సంచరించును. జనవరి 26, 2017 వరకు శని మూడవ ఇంట సువర్ణమూర్తిగాను తదుపరి సంవత్సరమంతా నాలుగవ ఇంట లోహమూర్తిగాను, రాహు పన్నెండవ ఇంట, కేతువు ఆరో ఇంట సువర్ణమూర్తులు.

ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు కలవు. ధనవ్యయం, గృహానికి సంబంధించిన మార్పులు, వ్యసనములు, అపనిందలు, భార్యభర్తల మధ్య పట్టింపులు, ఆదాయ సమస్యలు ఉండును.

కొంత మంది ఉద్యోగస్థులు ఏసీబీ దాడులు ఎదుర్కొందురు. ప్రభుత్వ ఉద్యోగులకు సామాన్యం. పై అధికారుల వల్ల రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవుట, పని ఒత్తిడి పెరుగుట ఉండగలదు. నిరుద్యోగులకు అనుకున్నంత అవకాశములు కలిసి రాకపోవచ్చును.

రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలమైనప్పటికీ ఏదో సమస్య ఎదురుకావచ్చు. ప్రజల్లో గుర్తింపు తగ్గదు. ఆలస్యముగానైనా పదవి లభించగలదు.

ఈ సంవత్సరం వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితములు కలవు. కిరాణ వ్యాపారములు బాగుండగలవు. ఫైనాన్స్ వ్యాపారములు, రియల్ ఎస్టేట్, జాయింట్ వ్యాపారములు నష్టంలో నడుచును.

సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం గుర్తింపు అంతగా లభించదు. నూతన నటీనటులకు కూడా అవకాశములు అంతంగా మాత్రమే ఉండును. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అగును. ప్రభుత్వ గుర్తింపు లభించక అవార్డులు కూడా రావు.

విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమఫలితాలు ఉంటాయి. చదువుపై శ్రద్దతగ్గి ఇతర వ్యాపకాలపై దృష్టిపడును. గురు బలం లేకపోవటంచే అనుకున్న మార్కులు రాక ఉత్తీర్ణత శాతం తగ్గును. ఎంట్రాన్స్ పరీక్షల యందు కూడా ఫలితములు బాగుండవు. అనుకున్న చోట సీటు పొందలేకపోవచ్చు.

ఈ సంవత్సరం వ్యవసాయం రంగం వారికి.. మొదటి పంట నష్టం, రెండవ పంట సామాన్యముగా ఉండును. కౌలుదార్లు ఆర్థికంగా నష్టపోదురు. ఫౌల్డ్రీ, రొయ్యలు, చేపల చెరువుల వాళ్లకి అతి సామాన్య లాభములు ఉండును.

ఈ సంవత్సరం వీరు గురువుకు, రాహువుకు శాంతులు చేయించవలెను. గురు, రాహు యంత్రములు ధరించడం మంచిది.

Leave a Reply