Karkatakam—Cancer
కర్కాటకం-2017-2018
పునర్వసు 4.పాదము.
పుష్యమి 1,2,3,4.పాదములు.
ఆశ్లేష 1,2,3,4.పాదములు.
ఆదాయం – 11, వ్యయం – 8, రాజపూజ్యం – 5, అవమానం – 4.
ఈ రాశివారికి గురుడు మూడవ ఇంట సెప్టెంబర్ 12 వరకు రజితమూర్తిగాను, తదుపరి 4వ ఇంట సువర్ణమూర్తిగాను వర్తించును. శని 6వ ఇంట సంవత్సరమంతా కూడా సువర్ణమూర్తి. రాహువు 2 ఇంట, కేతువు 8వ ఇంట ఆగస్టు 17 వరకు తామ్రమూర్తి, తదుపరి 1వ ఇంట రాహువు, 7వ ఇంట కేతువు లోహమూర్తులుగా ఉందురు.
ఈ సంవత్సరం వీరు మాతృ-పుత్ర పర ఇబ్బందులు, బాధలు, మతిమరుపు, భయం, భార్యభర్తల మధ్య సమస్యలతోను ఈ సంవత్సరం ఉండును.
ఉద్యోగస్తుల విషయమై చూడగా, స్థాన చలన, పై అధికారుల నుంచి ఇబ్బందులు, పని ఒత్తిడి ఎక్కువగా ఉండును.
రాజకీయ నాయకులకు శుభఆశుభ ఫలములు గోచరించుచున్నవి. కొంత అనుకూల వాతావరణం లేదు.
వ్యాపారుల విషయమై చూడగా, వ్యాపారమునందు కష్టపడినా, లాభములు ఉండవు. ఫౌల్ట్రీఫారం, వైద్య రంగంలో వారికి కొద్దిపాటి లాభము మాత్రమే ఉన్నది.
సినిమా, టీవీ, నాటకరంగంలో వారికి మిశ్రమ ఫలితాలు గోచరించుచున్నవి. కష్టపడినప్పటికీ సరైన ఫలితములు అందవు.
క్రీడారంగముల వారికి సామాన్యఫలితాలు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులకు కష్టపడి చదివిననూ తగు ఉత్తీర్ణత శాతం ఉండదు.
ఈ సంవత్సరం ఈ రాశివారు గురునకు, రాహు-కేతువులకు శాంతి చేయించినా శుభము. వీరు గురు యంత్రం ధరించుట మంచిది.
యంత్రములకై సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***
Leave a Reply
You must be logged in to post a comment.