Kumbha—Aquarius
కుంభం – 2016-17
ధనిష్ట . 3,4 పాదములు,
శతభిషం.1,2,3,4.పాదములు.
పూర్వాబాద్ర. 1,2,3 పాదములు.
ఆదాయము 8, వ్యయం 8. రాజపూజ్యము 3, అవమానం 5.
ఆగస్టు 11, 2016 వరకు గురుడు ఏడవ ఇంట రజితమూర్తిగాను, తదుపరి ఎనిమిదవ ఇంట తామ్రమూర్తిగాను, జనవరి 26, 2017 వరకు శని పదవ ఇంట సువర్ణమూర్తి, తదుపరి పదకొండవ ఇంట సువర్ణమూర్తిగాను, ఏడవ ఇంట రాహువు, ఒకటవ ఇంట కేతువు సంచరించుదురు.
ఆగస్టు వరకు వీరు తలపెట్టిన పనులు పూర్తయినప్పటికీ తదుపరి అనేక సమస్యలు ఎదుర్కొందురు. అనుకున్న పనులు పూర్తిగాక ఇబ్బందికర వాతావరణాలు ఎదుర్కొందురు. భార్యభర్తల మధ్య విభేదాలు, ధనపర సమస్యలు, అక్కర్లేని గొడవల్లోనూ ఇరుక్కొందురు. వీరికి ఈ సంవత్సరం కొంచెం గడ్డుకాలంగా చెప్పవచ్చు.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం లభించినానూ శ్రమకు తగ్గ ఫలితము వచ్చుట కష్టము. సస్పెండ్ అగుట లేదా, దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా ఇబ్బందికర సమయం. ప్రజల్లో వ్యతిరేకత, విపరీతమైన ధన ఖర్చు, ఏ పని చేసినా ఆటంకం, అనుకున్న పదవులు రాక ఇబ్బంది పడుదురు.
ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఇన్ కాంటాక్స్ అధికారుల నుంచి దాడులు తప్పకపోవచ్చు. వడ్డీ వ్యాపారస్తులకు అనుకోని సమస్యలు, నూతన వ్యాపారాలు కూడా లాభించక ఇబ్బంది పడుదురు. భాగస్వామ్య వ్యాపారాలు, షేర్ మార్కెట్ లో ఉన్న వారికి నష్టం తప్పదు.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం అనుకున్న అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడుదురు. ఆర్థికపర సమస్యలు పెరుగును. చేపట్టిన పనుల్లో కూడా విజయాలు ఉండవు.
విద్యార్థులకు ఆగస్టులోపు విజయ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో సీట్లు వచ్చినప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల అవి కూడా చేజారిపోవును. బాగా శ్రద్ధపెట్టి చదివినగానీ, ఉత్తీర్ణత పొందుట కష్టం.
ఈ సంవత్సరం వ్యవసాయదారులకు రెండో పంట ఇబ్బంది కలిగించును. రుణము తీర్చగలిగినప్పటికీ, మళ్లీ అప్పు చేయవలసి వచ్చును. కౌలుదార్లకు, చేపలు, రొయ్యల చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఫౌల్డ్రీ రంగం వారికి కొంత లాభము.
ఈ సంవత్సరం ఈ రాశి వారు గురు, శని, రాహువులకు శాంతి చేయిస్తే శుభం. గురు, రాహు యంత్రములు ధరించుట మంచిది.









Leave a Reply
You must be logged in to post a comment.