Kumbha—Aquarius
కుంభం – 2017 – 18
ధనిష్ట . 3,4 పాదములు,
శతభిషం.1,2,3,4.పాదములు.
పూర్వాబాద్ర. 1,2,3 పాదములు.
ఆదాయము – 11, వ్యయం.5. రాజపూజ్యము – 5, అవమానం – 6.
ఈ సంవత్సరం వీరికి గురుడు 8వ ఇంట సెప్టెంబర్ 12 వరకు తామ్రమూర్తిగాను, తదుపరి 9వ ఇంట లోహమూర్తి. శని 11వ ఇంట సంవత్సరమంతా సువర్ణమూర్తి. 7వ ఇంట రాహువు, 1వ ఇంట కేతువు ఆగస్టు 17 వరకు లోహమూర్తులుగాను తదుపరి 6 ఇంట రాహువు, 12వ ఇంట కేతువు రజితమూర్తులు.
ఈ సంవత్సరం ఈ రాశివారి గురించి చూడగా వీరికి ఆరోగ్య,గౌరవభంగాలు, పితృసంబంధిత ఆస్తి లాభము, శతృపరాజయం సూచిస్తున్నది.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చూడగా మంచి ఫలితములే గోచరించుచున్నవి. పై అధికారుల సహాయంతో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు.
వ్యాపారస్తులకు చూడగా సెప్టెంబర్ వరకు అంతబాగుండకపోయినా, తదుపరి భాగం పాడిపరిశ్రమలు, వైద్యవృత్తులవారికి మంచి ఫలితములే ఉన్నాయి.
ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా లాభించగలవు.
విద్యార్థులకు అనుకూల కాలముగానే చెప్పవచ్చును.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి సెప్టెంబర్ తదుపరి బాగుండగలదు.
రాజకీయ నాయకులకు గౌరవ భంగములతో కూడిన మిశ్రమ ఫలితములు ఉండగలవు.
ఈ సంవత్సరం వీరు శని, కేతువులకు శాంతి చేయించినా శుభ ఫలితములు ఉండగలవు.
వీరు ఈ సంవత్సరము శని,కేతు యంత్రములు ధరించుట వల్ల మంచి ఫలములు పొందు అవకాశమున్నది.
యంత్రములకై సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***
Leave a Reply
You must be logged in to post a comment.