Meenam—Pisces

మీనం – 2017 – 18
పూర్వాబాద్ర. 4 పాదములు.
ఉత్తరాబాద్ర .1,2,3,4.పాదములు.
రేవతి. 1,2,3,4 పాదములు.
ఆదాయము – 8, వ్యయం.- 11. రాజపూజ్యము – 1, అవమానం – 2.
ఈ రాశివారికి గురుడు 7వ ఇంట సెప్టెంబర్ 12 వరకు రజితమూర్తిగాను, తదుపరి 8వ ఇంట తామ్రమూర్తి, శని 10 ఇంట సంవత్సరమంతా తామ్రమూర్తి. 6వ ఇంట రాహువు, 12వ ఇంట కేతువు ఆగస్టు 17 వరకు తామ్రమూర్తులుగాను తదుపరి 5వ ఇంట రాహువు, 11వ ఇంట కేతువు లోహమూర్తులు. వీరికి ఐశ్వర్యలాభము, ఆరోగ్యము, కార్యనష్టము, ధననష్టము, పుత్రపర సమస్యలు ఉండగలవు.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చూడగా, పై అధికారులచే మాట పడుట, అనుకోని చోటకు బదిలీలు ఇటువంటి ఫలితములతో కూడుకొని ఉండును.
వ్యాపారస్తుల విషయమై చూడగా వ్యాపార లాభములు వచ్చుట చాలా కష్టముగా ఉండును. పాడిపరిశ్రమ, వైద్య వృత్తుల వారు తమ వృత్తులయందు కొన్ని అవమానకరమైన విషయములు జరుగును.
వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా నష్టమే సూచిస్తున్నది.
విద్యార్థులకు కష్టపడి చదివినా తృతీయ శ్రేణిలోనే ఉత్తీర్ణత పొందుతారు.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి మిశ్రమ ఫలితాలుఉండగలవు.
రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండగలవు.
ఈ సంవత్సరం వీరు గురు, శని లకు శాంతి చేయించినా శుభం.
అందువల్ల మీరు గురు,శని యంత్రములుధరించిన మంచి ఫలములు పొందు అవకాశమున్నది
యంత్రములకై సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***
Leave a Reply
You must be logged in to post a comment.