Mithunam—Gemini
మిధునం – 2017-2018
మృగశిర 3,4,పాదములు.
ఆరుద్ర 1,2,3,4.పాదములు.
పునర్వసు 1,2,3.పాదములు.
ఆదాయము – 2 వ్యయం – 11 , రాజపూజ్యం – 2 అవమానం – 4
గురుడు 4వ ఇంట సెప్టెంబర్ 12 వరకు సువర్ణమూర్తి, తదుపరి సంవత్సరమంతా 5వ ఇంట లోహమూర్తిగాను, శని 7వ ఇంట సంవత్సరమంతా తామ్రమూర్తిగాను, 3వ ఇంట రాహువు, 9 ఇంట కేతువు ఆగస్టు 17 వరకు లోహమూర్తులుగాను, తదుపరి 2వ ఇంట రాహువు, 8వ ఇంట కేతువు సువర్ణమూర్తులుగా సంచరించును.
ఈ సంవత్సరం ఉద్యోగస్తుల విషయమై చూడగా వీరు ధనపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ, వాటిని తొలగించుకుని విజయవంతంగా ముందుకు సాగుదురు. పేరు ప్రఖ్యాతలు పెరుగును. స్త్రీ, పురుషులకు వివాహయోగం సూచిస్తున్నది. ఉద్యోగస్తుల విషయమై చూడగా, కోరిన చోటకు ట్రాన్స్‌పర్‌లు, పై అధికారులచే గుర్తింపు లభించును.
రాజకీయ నాయకుల విషయమై చూడగా, ప్రభుత్వ రంగంలో ముఖ్యమైన పాత్ర వహించుచుదురు. ప్రజల్లో అనుకూల వాతావరణం ఉన్నది.
వ్యాపారుల విషయమై చూడగా, చేతివృత్తులు, వైద్యం, ఫౌల్ట్రీఫారం వ్యాపారులతో పాటు మిగిలిన వ్యాపారులకు కూడా లాభకరంగానే ఉండగలదు.
సినిమా, టీవీ, నాటకరంగముల వారికి శ్రమకు తగ్గ ఫలితము ఉండగలదు.
క్రీడాకారుల విషయమై చూడగా వారికి తగిన గుర్తింపు లభించుటయే కాకుండా ఆ రంగంలో స్థిరపడుట జరుగగలదు.
ఇక వ్యవసాయ రంగంలోని వారికి చూడగా అనుకూల వాతావరణమే కనబడుతున్నది. ప్రభుత్వ పరమైన రాయితీలు లభించే అవకాశం ఉన్నది.
విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితము ఉండగలదు. విద్యయందు శ్రద్ధపెట్టిన ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం వీరు గురుడుకు శాంతి చేయించుట శుభం.
విరు నరఘోష యంత్రము ధరించిన మంచి పలముకలుగును.
యంత్రములకై సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***
Leave a Reply
You must be logged in to post a comment.