Simham—Leo
సింహం 2016 – 17
మఖ.1,2,3,4.పాదములు.
పుబ్బ.1,2,3,4.పాదములు.
ఉత్తర.1.పాదము.
ఆదాయం – 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3.
ఆగస్టు 11, 2016 వరకు గురుడు ఒకటవ ఇంట సువర్ణమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా రెండో ఇంట లోహమూర్తిగా సంచరించును. జనవరి 26, 2017 వరకు శని నాలుగవ ఇంట తామ్రమూర్తి, తదుపరి ఐదవ ఇంట రజితమూర్తిగా సంచరించును. రాహువు ఒకట ఇంట, కేతువు ఏడవ ఇంట రజితమూర్తులు.
ఈ సంవత్సరం అధికమైన దేహశ్రమ, నేత్రపీడ, మానసికంగా బాధలతోనూ, అపనిందలతోనూ ఉందురు. ఊహించని సంఘటనలు జరుగును. కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి బంధుమిత్రుల సహాయం తప్పకపోవచ్చును. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన సమయం. దూర ప్రాంత బదిలీలు వెళ్లుట, పై అధికారులచే మాట పడుట, సస్పెండు అవుట జరగవచ్చును. అనారోగ్యం వల్లగాని, లేదా పై అధికారుల ఒత్తిడి వల్లకాని, వీఆర్ఎస్ తీసుకోవాలన్న కోరిక కలుగును. నిరుద్యోగులకు కూడా అంత ఆశాజనకంగా లేదు.
రాజకీయ నాయకులకు గురు, శనిల బలం లేకపోవడం వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గును. అంతేగాక కొన్ని నింద ఆరోపణలు ఎదుర్కొనవలసి వచ్చును. పదవులు కూడా పొందే అవకాశం కలగదు. ఉన్న పదవులకు కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చును.
వ్యాపారస్తులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుదురు. కొన్ని రకముల వ్యాపారములు మాత్రమే బాగుండును. నూతన కాంట్రాక్టులు చేయువారికి ఆ పనులు అనుకూలించవు. ప్రభుత్వ కాంట్రాక్టులకు బిల్లులు తొందరగా అవ్వవు. రియల్ ఎస్టేట్ వారికి బాగానే వుండును.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం కొన్ని విజయాలు కలిగిననూ, సరైన గుర్తింపు లభించదు. వచ్చే అవకాశాలు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడుదురు. అవార్డులు, రివార్డులు లభించడం కూడా చాలా కష్టమగును.
విద్యార్థులకు ఈ సంవత్సరం పరీక్షకాలమా అన్నట్టుగా ఉండును. చదువుకన్నా, చెడు వ్యసనములపై దృష్టి పెరుగును. తక్కువ మార్కులతో ఉత్తీర్ణత, ఎంట్రాన్స్ పరీక్షల్లో ర్యాంకులు పొందలేకపోవుట. అనుకున్న చోట్ల సీట్లు రాకుండా ఇబ్బందులు పడుదురు.
ఈ సంవత్సరం వ్యవసాయ రంగం వారికి రెండో పంట మాత్రమే లాభించును. అప్పుల బాధలతో ఇబ్బందులు తప్పకపోవచ్చును. కౌలుదార్లకు కూడా అనుకున్నంత లాభము ఉండకపోవచ్చు. పౌల్డ్రీ రంగము, చేపలు, రొయ్యల చెరువులు నష్టములో ఉండును.
ఈ సంవత్సరం గురు, శనికి శాంతి చేయించుకోవలెను. శని యంత్రం ధరించుకోవలెను.
Leave a Reply
You must be logged in to post a comment.