Menu

Santhana Yoga

జ్యోతిష శాస్త్రములో సంతాన యోగము గూర్చి తెలుసుకొనుట
లగ్నము నుంచి పంచమ భావమును పరిశీలించుట గురువునకు ఇది శుభస్థానము గా వున్న సంతాన సుఖ ప్రాప్తిలు వుండగలవు, మరియు పంచమాధిపతి స్వగృహములో వుండి మరియు భాగ్యదిపతి పూర్తి ద్రుష్టి వున్న సంతానయోగములు కలుగగలవు, గురువు కేంద్ర త్రికోణములలోను మరియు నవమ భావములో గురుశుక్రులతో పంచమాదిపతివున్నాను సంతాన కారకత్వముగా చెప్పబడుతున్నది. శుక్ర ద్రుష్టి వల్ల స్త్రీ సంతానము మరియు జన్మలగ్నములో స్త్రీ రాశిలో స్త్రీ గ్రహ ద్రుష్టి కలిగినను స్త్రీ సంతతి కలుగును.
జన్మ లగ్నములో పాపగ్రహ సంతాన భావము యొక్క గ్రహము స్వరాశి స్థితిలో ఉన్నను పురుష సంతతి కలుగును. ఇంకనూ చాల విధములుగా ఈ సంతాన యోగములను చూడ వచ్చును.

బాలారిస్టములు

12 సంవత్సరముల లోపు మరణాన్ని సూచించే యోగాన్ని బాలారిస్టం అందురు.
అష్టమం [ఎనిమిది] లో చంద్రుడు, సప్తమం[ఏడు] లో కుజుడు, నవమం [తొమ్మిది] లో రాహువు, లగ్నము[ఒకటి] లో శని,తృతీయం [మూడు] లో గురుడు, పంచమం [అయిదు] లో రవి, సస్టమం [ఆరు] లో శుక్రుడు, చతుర్ధం [నాలుగు] లో భుదుడు, ఎకద్వితియం [ఒకటి రెండు] లో  కేతువులు బాలారిష్ట కరములుగా చెప్పబడ్డాయి, ఆగ్రహముల యొక్క దశలలో ప్రభావము ఎక్కువగా వుంటుంది. అయితే దోషముగల గ్రహముపై శుభగ్రహ దృష్టి వున్న ఆ దోషము తగ్గగలదు.
కొన్ని దోషబంగాలు 
1) లగ్నాదిపతి బలముగా వుండి శుభ గ్రహ దృష్టి కలిగి కేంద్రస్థితి పొంది పాపగ్రహ దృష్టి లేకున్నా బాలారిష్ట బంగమగును.
2) పూర్ణ చంద్రుని పై శుభ గ్రహ దృష్టి శుభ రాశి నవాంశలలో కాని స్వ,ఉచ్చ,మిత్ర,వర్గాములలో గాని  ఉన్న బాలారిష్ట బంగమగును.
3) గురు, శుక్ర, భుదులలో ఒకరు అయినా కేంద్రములో పాప సంభందము [దృష్టి] లేకున్నా  బాలారిష్ట బంగమగును.
4) శుక్ల పక్షములో రాత్రి కాని పగటిపూట గానీ జన్మించి చంద్రుడు శుభ దృష్టిని కల్గి సస్ట, అష్టమ స్థానాలలో ఉన్న  బాలారిష్ట బంగమగును.

Leave a Reply