Menu

Tula—Libra

libra

తుల -2016-17

చిత్త.3,4.పాదములు.
స్వాతి.1,2,3,4,.పాదములు.
విశాఖ.1,2,3. పాదములు.

ఆదాయము 11, వ్యయం 14, రాజపూజ్యము 5, అవమానం 6.

ఆగస్టు 11, 2016 వరకు గురుడు పదకొండవ ఇంట రజితమూర్తి, తదుపరి పన్నెండవ ఇంట కూడా రజితామూర్తిగా సంచరించును.

జనవరి 26, 2017 వరకు శని రెండవ ఇంట రజితమూర్తిగాను, తదుపరి మూడవ ఇంట సంవత్సరమంతా తామరమూర్తిగా సంచరించును.

రాహువు పదకొండవ ఇంట, కేతువు ఐదవ ఇంట లోహమూర్తులు.

ఈ సంవత్సరం వీరికి దైవబలం వల్ల ధనాదయం బాగుండును. గతంలో సాధించలేని కార్యక్రమాలన్నిటిని కూడా పూర్తి చేయగలరు. వృత్తిలో వృద్ధి, పేరు ప్రతిష్టలు లభించగలవు. వివాహా శుభకార్యక్రమాలు చేయుట, పుణ్యక్షేత్ర దర్శనములు చేయుట ఉండగలదు.

ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధములుగా లాభకరముగా ఉన్నది. ప్రమోషన్లు వచ్చుట. కావాల్సిన చోటకు బదిలీలు జరుగును. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నత లభించవచ్చు. తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మినెంట్ అగును. నిరుద్యోగులకు కూడా అనుకూలమైన కాలము.

రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతలు, ప్రజల్లో నమ్మకం, పార్టీలో వీరిదే పై చేయిగా ఉండగలదు. తప్పక పదవి లభించును.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారములందు లాభము పొందుదురు. నూతన వ్యాపారములు కూడా కలిసి వచ్చును. హోల్ సేల్, రిటైల్, భాగస్వామ్య వ్యాపారముల యందు బాగుండగలదు. షేరు మార్కెట్ వారు మంచి లాభము పొందుదురు. సరుకులు నిల్వ చేయువారికి సామాన్యముగా ఉండును.

సినిమా, టీవీ, నాటక రంగముల వారికి గురు బలం వల్ల మంచి ఫలితములు లభించును. అన్నిట్లయందు విజయము లభించి స్థిరాస్థి వృద్ధి చేయుదురు. విజయాలు వీరి చుట్టు తిరుగును. ప్రభుత్వ గుర్తింపు లభించి అవార్డులు కూడా లభించును.

విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి మార్కులతో ముందుకు సాగుదురు. ఎంట్రాన్స్ పరీక్షల వారికి మంచి ర్యాంకులు రాగలవు. విదేశాల్లో కూడా సీటు లభించగలదు. క్రీడాకారులు కూడా శుభకాలము.

వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు కూడా లాభించి రుణములు తీర్చుదురు. కౌలు రైతులకు కూడా అభివృద్ధికరంగానే ఉండును. పౌల్డ్రీ, రొయ్యలు, చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు కూడా కలుగును.

ఈ సంవత్సరం వీరు ఈర్ష్య, అసూయ కారణంగా నరఘోష కలుగురు. అందుచేత వీరు నరహోష యంత్రమును ధరించుట శుభం.

Leave a Reply