Tula—Libra
తుల 2017-18
చిత్త.3,4.పాదములు.
స్వాతి.1,2,3,4,.పాదములు.
విశాఖ.1,2,3. పాదములు.
ఆదాయము – 14, వ్యయం – 11 రాజపూజ్యము – 7, అవమానం – 7.
గురుడు 12వ ఇంట సెప్టెంబర్ 12 వరకు రజితమూర్తిగాను, తదుపరి 1వ ఇంట లోహమూర్తిగాను వర్తించును. శని మూడవ ఇంట సంవత్సరమంతా తామ్రమూర్తి. 11వ ఇంట రాహువు, 5వ ఇంట కేతువు ఆగస్టు 17 వరకు లోహమూర్తులు. 10 ఇంట రాహువు, 4వ ఇంట కేతువు తదుపరి రజితామూర్తిగా వర్తించును. ఈ సంవత్సరం వీరికి అనారోగ్యం, ధనలాభము, పుణ్యక్షేత్ర దర్శనం, ఉన్నత పదవీలాభము కలుగును. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి.
ఉద్యోగస్తుల విషయం చూడగా స్థాన చలనం, పై అధికారులచే పని ఒత్తిడి ఉండగలదు.
వ్యాపారస్తుల విషయమై చూడగా, సామాన్య ఫలితములు గోచరించుచున్నవి. ఆదాయం కూడా అంతంతమాత్రమే కనబడుచున్నది. పాడిపరిశ్రమలు, పౌల్ట్రీ, వైద్యరంగంల వారికి పెద్దగా ఆదాయ లాభములు లేకపోవచ్చు.
ఇక విద్యార్థులకు అతిశ్రమ మీద విజయం పొందే అవకాశం ఉంది.
సినిమా, టీవీ, నాటక రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఈ సంవత్సరం వీరు గురు, శని లకు శాంతి చేయించుకొనుట శుభము.
శని ప్రబావము తగ్గుటకై శని యంత్రము ధరించిన మంచి ఫలములు పొందు అవకాశమున్నది
యంత్రములకై సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***
Leave a Reply
You must be logged in to post a comment.