Menu

Vrishabham—Taurus

taurus

వృషభం – 2016

కృత్తిక 2, 3, 4. పాదములు.

రోహిణి 1, 2, 3, 4. పాదములు.

మృగశిర 1, 2. పాదములు.

ఆదాయము -11, వ్యయము – 14,రాజపూజ్యం -4, అవమానం – 7

ఆగస్టు 11, 2016 వరకు గురుడు నాలుగవ ఇంట రజితమూర్తిగాను, తదుపరి ఐదవ ఇంట తామ్రమూర్తిగాను సంవత్సరమంతా వర్తించును. జనవరి 26, 2017 నుంచి శని ఏడవ ఇంట తామ్రమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా ఎనిమిదవ ఇంట లోహమూర్తిగాను వర్తించును.

రాహు నాలుగవ ఇంట, కేతువు పదవ ఇంట సంవత్సరమంతా, రజితా మూర్తులుగా సంచరించుదురు.

ఈ రాశివారికి ఫలితాలు చూస్తే..

ఈ సంవత్సరం ఈ రాశివారికి శుభఫలములతో పాటు అశుభఫలములు కూడా సూచించుచున్నవి. గ్రహస్థిని బట్టి చూడగా, ధన ఆదాయం బాగుండును. ధన వ్యయం కూడా అధికంగానే ఉండును. మాతృవంశ నష్టములు, వాహన ప్రమాదాలు, ఆరోగ్యభంగములు, భార్యాపర సమస్యలు ఉంటాయి. వివాహశుభకార్యములు ఈ రాశివారి తెలివితేటలతో సాధించుకుందురు.

ఉద్యోగస్తులకు మంచి ఫలితములు కలవు. ఆకస్మిక బదిలీలు, పై అధికారులతో మాట పడే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగం ఫర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలవు.

 రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు కోల్పోవుట, ప్రజల్లో పలుకుబడి తగ్గే అవకాశం ఉంది. ధనాన్ని అధికంగా ఖర్చు చేయుదురు. స్థిరాస్థి సమస్యలు ఉండగలవు. జయఅపజయాలు సరి సమానంగా ఉండును.

ఈ సంవత్సరం వ్యాపారస్థులకు అనుకూలంగానే ఉంది. హోల్ సేల్ వారి కన్నా, రిటేల్ రంగం వారికి అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారంలకు కొంత నష్టం కలదు. సరుకులు నిల్వ చేయువారికి శుభ ఫలములు కలవు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, షేర్ మార్కెట్ వారికి శుభ,అశుభ ఫలితములు సూచించుచున్నవి.

సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన నటీనటులకు అవకాశాలు తక్కువ అనే చెప్పవచ్చు. ప్రభుత్వం సంబంధిత అవార్డులు పొందడం కూడా కష్టమే. ఈ సంవత్సరం సినీ పరిశ్రమ కొంత నష్టములో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

ఈ సంవత్సరం విద్యార్థులకు చదువుపై శ్రద్ధతగ్గి, ఇతర విషయాలపై ఆసక్తి పెరుగును. బద్దకం పెరుగును. చెడు సవాసాలు పెరుగును. విదేశీ ప్రయాణాలు కలిసి రాగలవు. ఎంట్రన్స్ పరీక్షల్లో విజయ అవకాశాలు తక్కువ. క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం ప్రకృతి వైపరిత్యం వల్ల దిగుబడి చేతికి అందదు. అప్పుల బాధ పెరుగును. కౌలుదారులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొందురు. గృహంలో శుభకార్యములకు ఇబ్బందులు ఉండదు. చేపలు, రొయ్యల వ్యాపారం చేయువారికి మిశ్రమ ఫలితాలు ఉండును.

ఈ రాశి వారికి రాహువునకు, గురువునకు శాంతి చేయించుట శుభము. గురు,రాహుయంత్రం ధరించుట శుభం.

Leave a Reply