Menu

Vrishabham—Taurus

taurus

వృషభం – 2017-18

కృత్తిక 2,3,4. పాదములు.
 
రోహిణి 1,2,3,4.పాదములు.
 
మృగశిర 1,2.పాదములు.
 
ఆదాయము – 14 వ్యయము – 11 రాజపూజ్యం – 6 అవమానం – 1
 
గురుడు సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు 5వ ఇంట తామ్ర‌మూర్తిగాను, త‌దుప‌రి 6 ఇంట సువ‌ర్ణ‌మూర్తి, శ‌ని 8 ఇంట సంవ‌త్స‌ర‌మంతా లోహ‌మూర్తిగా వ‌ర్తించును. 4వ ఇంట రాహువు, ప‌ద‌వ ఇంట కేతువు ఆగ‌స్టు 17 వ‌ర‌కు ర‌జితమూర్తిగాను, త‌దుప‌రి మూడ‌వ ఇంట రాహువు, తొమ్మిద‌వ ఇంట కేతువు రజిత‌మూర్తిగాను ఉందురు.
 
ఈ రాశివారికి ద్వితీయార్థంలో గురుడు కొన్ని శుభ‌ఫ‌ల‌ములు ఇచ్చును. అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా సూచించుచున్న‌వి. 
ఉద్యోగ‌స్తుల విష‌య‌మై చూడ‌గా, వారికి కొంచెం క‌ష్ట‌కాల‌ముగానే ఉండును. పై అధికారుల నుంచి ఒత్తిడి, శ్ర‌మ అధికంగా ఉండును.
రాజ‌కీయనాయ‌కుల విష‌య‌మై చూడ‌గా, వారికి ప్ర‌జ‌ల్లో గుర్తింపు ల‌భించును. ప‌ద‌వులు పొందే అవ‌కాశాలు క‌ల‌వు. 
వ్యాపార‌స్తుల విష‌య‌మై చూడ‌గా, వైద్య, చేతి వృత్తులు, ఫౌల్ట్రీ ఫారం వ్యాపార‌స్తుల‌కు కొంచెం ఇబ్బందిక‌ర‌మైన‌టువంటి ప‌రిస్థితులు ఉండ‌గ‌ల‌వు.
సినిమా,టీవీ,నాట‌క‌రంగ‌ముల వారికి శ్ర‌మ‌ప‌డ్డా ఆర్థిక‌ప‌ర‌మైన లాభాలు గోచ‌రించ‌వు. 
ఇక క్రీడాకారుల విష‌య‌మై చూడాగా కొంత‌మందికే గుర్తింపు ల‌భించును.
విద్యార్థుల విష‌య‌మై చూడగా, ప్ర‌థ‌మ‌శ్రేణి ఉత్తీర్ణ‌త పొంద‌టం చాలా క‌ష్టం. శ్ర‌మ‌, ఏక‌గ్ర‌త లోపించును. 
వ్య‌వ‌సాయ రంగం వారికి చూడ‌గా రెండు పంట‌లు కూడా ఆశించిన ఫ‌లితాలు ఉండ‌వు. అప్పులు చేసే అవకాశం ఉన్న‌ది. ఈ సంవ‌త్స‌రం ఈ రాశివారు గురు, శ‌ని శాంతులు చేయించుకొనుట మంచిది.
 గురు యంత్రం ధ‌రించుట శుభం.
                     యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557

Leave a Reply