Meenam—Pisces
మీనం – 2016-17
పూర్వాబాద్ర. 4 పాదములు.
ఉత్తరాబాద్ర .1,2,3,4.పాదములు.
రేవతి. 1,2,3,4 పాదములు.
ఆదాయము – 5, వ్యయం 14. రాజపూజ్యము 6, అవమానం 5.
ఆగస్టు 11, 2016 వరకు గురుడు ఆరవ ఇంట లోహమూర్తిగాను, తదుపరి ఏడవ ఇంట రజిత మూర్తిగాను సంచరించును. జనవరి 26, 2017 వరకు శని తొమ్మిదవ ఇంట లోహమూర్తి, తదుపరి పదవ ఇంట తామ్రమూర్తి. ఆరవ ఇంట రాహువు, పన్నెండవ ఇంట కేతువు తామ్రమూర్తులు.
ఈ సంవత్సరం వీరికి ధనము చేతికి వచ్చినప్పటికీ, అధిక ఖర్చుల వల్ల నిలబడదు. ద్వితీయార్థంలో వీరి పట్టుదల వలన కార్యానుకూలత చేసుకుని ముందుకు వెళతారు. స్త్రీ మూలక సమస్యల వలన మనశ్శాంతి తగ్గును. శతృవులు పెరుగును.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మంచి కాలమని చెప్పవచ్చు. తాత్కాలిక ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకునుట. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం మంచి సమయంగా చెప్పవచ్చు. గవర్నమెంట్ సంస్థల్లో పని చేస్తున్న వారికి ప్రమోషన్లు, పర్మినెంట్లు ఉండగలవు.
ఇక ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి అభిమానం ఏర్పడుతుంది. అధిష్టానం వీరిని గుర్తించి, మంచి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ధనం మంచి నీటి వలే ఖర్చు చేయాల్సి వస్తుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. వీరు చేసే వ్యాపారాలు లాభాల వైపు సాగును. హోల్ సేల్, రిటైల్, భాగస్వామిక వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితములే ఉన్నాయి. షేర్ మార్కెట్ లో మంచి లాభము పొందుదురు. సరుకులు నిల్వ చేయువారికి కూడా లాభాలు అధికముగా ఉన్నాయి.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి అన్ని విధాల అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. స్థిరాస్తులు పెరుగుతాయి. నూతన నటీనటులకు విజయాలు పెరుగుతాయి. వీరికి ఈ సంవత్సరం శుభకరంగా ఉంది. ప్రభుత్వపర అవార్డులు కూడా పొందుతారు.
ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత లభించే అవకాశం ఉంది. ఎంట్రాన్స్ టెస్టుల్లో కూడా విజయాలు పొందుతారు. అనుకున్న చోటులో సీట్లు పొందడమే కాకుండా, విదేశాల్లో సీటు పొందే అవకాశం ఉంది. క్రీడాకారులు కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు.
ఈ సంవత్సరం వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు లాభదాయకముగానే ఉంటాయి. కౌలుదారులు కూడా పూర్వపు బాకీలు తీర్చే అవకాశము కలుగుతుంది. పౌల్డ్రీ రంగము, చేపలు, రొయ్యలు పెంపకందారులకు కూడా మంచి లాభదాయకముగా ఉంటుంది.
ఈ సంవత్సరం ఈర్ష్య, అసూయ, ద్వేషం వల్ల వీరు నరఘోష యంత్రం ధరించుకోవాల్సి ఉంటుంది.









Leave a Reply
You must be logged in to post a comment.