Makaram—Capricorn
మకరం – 2016-17
ఉత్తరాషాడ. 2,3,4 పాదములు.
శ్రవణం.1,2,3,4.పాదములు.
ధనిష్ట. 1,2 పాదములు.
ఆదాయము 8, వ్యయం 8. రాజపూజ్యము 7, అవమానం 2.
ఆగస్టు 11, 2016 వరకు గురుడు ఎనిమిదవ ఇంట సువర్ణమూర్తిగాను, తదుపరి తొమ్మిదవ ఇంట సువర్ణమూర్తిగాను, జనవరి 26, 2017 నుంచి శని పదకొండవ ఇంట రజిత మూర్తిగాను, తదుపరి పన్నెండవ ఇంట లోహమూర్తిగాను సంచరించును. ఎనిమిదవ ఇంట రాహువు, రెండవ ఇంట కేతువు రజితమూర్తులుగా సంచరిస్తారు.
వీరికి ఈ సంవత్సరం ఆదాయవ్యయాలు సరిసమానంగా ఉండును. జీవితాన్ని సాఫీగా సాగిస్తారు. వీరి జీవితంలో స్త్రీల ప్రాముఖ్యత పెరుగుతుంది. దైవపర కార్యక్రమాలు నిర్వహిస్తారు. భూసంబంధిత వ్యవహారాలు కొనసాగిస్తారు. కొన్ని విషయాల్లో ధన నష్టం తప్పకపోవచ్చు.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు సగ భాగం ఇబ్బందులు, మిగత సగ భాగం సామాన్యంగా ఉండును. అపవాదులు, ఏసీబీ దాడులు ఎదుర్కొవడంగానీ, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం గాని జరగవచ్చు. నిరుద్యోగులకు కూడా మంచి కాలం కాదు. ఆగస్టు తర్వాత కొంత స్థిరత్వం లభించి ఉద్యోగ అవకాశములు వచ్చును.
ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు లభించుటయే కాకుండా వీరు ప్రారంభించిన ప్రజాకార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చును. ఎన్నికల యందు కూడా విజయం లభించును. శతృవుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చును.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి సమయమని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి, భాగస్వాములకు, రిటైల్ వ్యాపారస్తులకు, హోల్ సేల్ వ్యాపారస్తులకు ఆగస్టు నుంచి మంచి లాభాలు కలుగును. షేర్ మార్కెట్ లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం కొన్ని అవకాశాలను కోల్పోయినప్పటికీ వచ్చిన వాటిని సద్వినియోగపరుచుకుందురు. ధన పర సమస్యలు వచ్చినప్పటికీ ఇబ్బంది అనిపించదు. అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంది.
విద్యార్థులకు ఈ సంవత్సరం అంత మంచి ఫలితాలు కనిపించుట లేదు. ప్రథమార్థ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడం కష్టం కావచ్చు. ఎంట్రాన్స్ పరీక్షల్లో కూడా విజయం పొందుట కష్టం అవ్వవచ్చును. కొన్ని సబ్జెక్టులలో చదువుపై శ్రద్ధ తగ్గి పాసవుట కష్టం అయ్యే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో చదువుపై దృష్టిపెడితే విజయం సాధించగలరు.
ఈ సంవత్సరం వ్యవసాయ రంగం వారికి మొదటి పంట నష్టం, రెండో పంట లాభము సూచించుచున్నది. బాకీలు తీర్చుకునుట కష్టం అగవచ్చును. కౌలుదార్లు మిశ్రమ ఫలితాలు పొందుదురు. పౌల్డ్రీ రంగము, చేపలు, రొయ్యల వారు కొద్ది పాటి లాభంతోనే సరిపెట్టుకొనవలసి వచ్చును.
ఈ సంవత్సరం వీరు గురువు, రాహువులకు శాంతులు చేయించుకొనట శుభం. రాహు యంత్రం ధరించుట మంచిది.









Leave a Reply
You must be logged in to post a comment.